సునీల్ పరిస్థితి ఏంటి ?

Published on Feb 22,2020 18:38 PM

కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన సునీల్ ఆ తర్వాత అనూహ్యంగా హీరో అయ్యాడు. అందాల రాముడు సినిమా హిట్ కావడంతో ఇక వరుసగా హీరోగానే నటించడానికి సిద్దమైపోయి కామెడీ వేషాలు మానేసాడు దాంతో అటు హీరోగా సక్సెస్ కాలేక ఇటు కమెడియన్ గా చేయలేక రెంటికి చెడిన రేవడిలా అయ్యింది పాపం సునీల్ పరిస్థితి. హీరోగా నటించిన చిత్రాలు వరుసగా ప్లాప్ అవుతుండటంతో ఇక వాటికి ఫుల్ స్టాప్ పెట్టేసి కమెడియన్ గా నటించడానికి సిద్దమయ్యాడు.

అరవింద సమేత , అల ..... వైకుంఠపురములో తదితర చిత్రాల్లో సునీల్ కమెడియన్ గా నటించాడు. అయితే ఆ చిత్రాలు అంతగా సునీల్ కు ఉపాయాగపడలేదు. అలాగే అవి అంతగా ప్రాధాన్యత ఉన్న చిత్రాలు కూడా కావు. ఇప్పుడు కమెడియన్ గా నటించడానికి నేను సిద్ధమని సునీల్ స్వయంగా ప్రకటించినప్పటికీ పాపం ఆశించిన స్థాయిలో పాత్రలు దక్కడం లేదు. దాంతో స్వయంకృతాపరాథం అంటూ బాధపడుతున్నాడట సునీల్.