రజనీకాంత్ కొత్త చిత్రం టైటిల్ ఏంటో తెలుసా ?

Published on Jan 26,2020 12:49 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా శివ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. హీరో గోపీచంద్ నటించిన '' శౌర్యం '' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన శివ ఆ తర్వాత సినిమా కూడా గోపీచంద్ తోనే తీసాడు అయితే ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది దాంతో తమిళబాట పట్టాడు. అక్కడ తమిళ స్టార్ హీరో అజిత్ తో వరుసగా మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ లు కొట్టాడు దర్శకుడు శివ. ఆ సినిమాల విజయాలతో రజనీకాంత్ తాజాగా ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఈ చిత్రానికి పెట్టిన టైటిల్ ఏంటో తెలుసా ...... '' అన్నాత్త '' .

ఇది తమిళ టైటిల్ ఇక త్వరలోనే తెలుగు టైటిల్ ని కూడా పెట్టనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంది. ఇక మిగిలిన షూటింగ్ ని చెన్నై లో చేయనున్నారు. మీనా , కుష్భు లు రజనీకాంత్ సరసన నటిస్తుండగా కీర్తి సురేష్ కీలక పాత్రలో నటిస్తోంది. ఇటీవలే దర్బార్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజనీకాంత్ మరోసారి మాస్ మసాలా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.