బాలయ్య కొడుకు హీరో అయ్యేది ఎప్పుడు ?

Published on Oct 31,2019 16:45 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ హీరో అయ్యేది ఎప్పుడు ? అంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. అసలు బాలయ్య కొడుకు 2017 లోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని అన్నారు.  కానీ హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు ఇక ఇప్పుడేమో 2019 కూడా అయిపోతోంది. కానీ ఇంతవరకు కూడా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అసలు వార్తలే రావడం లేదు దాంతో బాలయ్య అభిమానుల్లో కంగారు మొదలయ్యింది.

అయితే ఇతర మార్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య కొడుకు మోక్షజ్ఞ హీరోగా నటించడానికి ఆసక్తి చూపించడం లేదట. నటన కంటే బిజినెస్ చూసుకుంటాను అని అంటున్నాడట దానికి తోడు బాలయ్య కొడుకు మరీ లావుగా కూడా అయ్యాడు దాంతో మోక్షజ్ఞ హీరో అవ్వడం కష్టమే అనుకుంటా అని అంటున్నారు.