జెర్సీ హిందీలో విడుదల అయ్యేది ఎప్పుడో తెలుసా ?

Published on Nov 01,2019 13:40 PM

తెలుగులో మంచి విజయం సాధించిన జెర్సీ చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతోంది. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు ఈ చిత్రంలో. ఇప్పటికే కబీర్ సింగ్ అంటూ ప్రభంజనం సృష్టించిన షాహిద్ కపూర్ మరో హిట్ పై కన్నేశాడు అందుకే తెలుగులో విజయం సాధించిన జెర్సీ ని ఎంచుకున్నాడు. ఇక ఈ చిత్రం విడుదల అయ్యేది ఎప్పుడో తెలుసా ....... 2020 ఆగస్టు 28 న.

ఇంకా ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు కానీ రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేసారు ఆ చిత్ర బృందం. ఇక ఈ చిత్రాన్ని తెలుగు నిర్మాతలు అల్లు అరవింద్ - దిల్ రాజు లు సంయుక్తంగా నిర్మిస్తుండటం విశేషం. తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి ఈ హిందీ చిత్రానికి కూడా దర్శకత్వం వహించడం విశేషం.