చరణ్ తండ్రి అయ్యేది ఎప్పుడు ?

Published on Mar 07,2020 11:24 AM

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ ఉపాసన రెడ్డి ని పెళ్లి చేసుకొని దాదాపు ఎనిమిదేళ్లు దాంతో మా చరణ్ ఎప్పుడు తండ్రి అవుతాడా ? అని వేయి కళ్ళతో ఎదురు చేస్తున్నారు మెగా అభిమానులు. చరణ్ - ఉపాసన ల పెళ్లి 2012 లో జరిగింది. ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమ పెళ్లి కావడంతో వెంటనే అమ్మానాన్న అవుతారని అనుకున్నారు కానీ ఏళ్ళు గడుస్తున్నా కూడా చరణ్ తండ్రి కాకపోవడంతో బాధపడుతున్నారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా చరణ్ తండ్రి అయితే బాగుండు అని చాలా ఆశగానే ఉన్నాడు కానీ పాపం ! చిరు కోరిక కూడా తీరడం లేదు. దాంతో ఇంట్లో తరచుగా పిల్లల గురించి చర్చ సాగుతూనే ఉందట ! కానీ చరణ్ సినిమాలతో బిజీ గా ఉన్నాడు కాబట్టి కుదరడం లేదు. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు చరణ్. ఈనెల 27 న చరణ్ పుట్టినరోజు మరి ఈ సందర్భాంగానైనా చరణ్ తీపి కబురు చెబుతాడేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు. మరి వాళ్ళ కోరిక తీరేది ఎప్పుడో !