ఈ భామకు ఛాన్స్ ఇచ్చేది ఎవరు ?

Published on Nov 10,2019 15:45 PM
హాట్ భామ ప్రగ్యా జైస్వాల్ కంచె చిత్రంతో తనదైన ముద్ర వేసింది. అయితే కంచె చిత్రంలో నిండైన చీరలో దర్శనం ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేస్తూ ఫోటో షూట్ చేసింది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా రెచ్చిపోయి అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది. అయితే ఈ భామ ఎంతగా రెచ్చిపోయినా ఆశించినట్లుగా ఛాన్స్ లు అయితే రాలేదు పాపం.

ఒకవేళ వచ్చిన అరకొర సినిమాలు కూడా అంతగా ఆడలేదు దాంతో ట్విట్టర్ , ఇన్ స్టా గ్రామ్ లలో హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ టైం పాస్ చేస్తోంది ప్రగ్యా జైస్వాల్. ఈ భామ అందంగా ఉంటుంది అంతకుమించి నిండైన చీరలో మరింతగా అందంగా కనిపిస్తుంది అయితే దర్శక నిర్మాతల దృష్టి కానీ , హీరోల దృష్టి కానీ ఈ భామ మీద పడటం లేదు దాంతో ఛాన్స్ లు రావడం లేదు పాపం. ఈ భామ అందాలన్నీ అడవి కాచిన వెన్నెలలా సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం అవుతున్నాయి పాపం.