ఆ ఇద్దరిలో అవార్డు ముందుగా వచ్చేది ఎవరికి ?

Published on Jan 08,2020 23:41 PM
సూపర్ స్టార్ కృష్ణ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావాలని మెగాస్టార్ చిరంజీవి కోరుకుంటుండగా అల్లు అరవింద్ కు పద్మశ్రీ అవార్డు ఇవ్వాల్సిందే అని అల్లు అర్జున్ పట్టు బడుతున్నాడు. దాంతో ఈ ఇద్దరిలో ఎవరికి ముందుగా కేంద్ర ప్రభుత్వం అవార్డుని ఇస్తుందనే చర్చ మొదలయ్యింది ఫిలిం నగర్ సర్కిల్లో. ఇద్దరు కూడా మెగా కాంపౌండ్ హీరోలు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయడమే కాకుండా డిమాండ్ కూడా చేస్తున్నారు దాంతో ఈ ఇద్దరిలో ఎవరి డిమాండ్ నెరవేరుతుంది ? ముందుగా ఎవరికి అవార్డు వస్తుందనే చర్చ ఘాటుగానే సాగుతోంది.

కృష్ణ 350 కి పైగా చిత్రాల్లో నటించిన హీరో అలాగే తెలుగు తెరకు సరికొత్త టెక్నాలజీ ని తెచ్చిపెట్టిన సాహసి కూడా అందుకే కృష్ణకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావాలని అంటున్నాడు చిరంజీవి. హీరోగా ,నిర్మాతగా , దర్శకుడిగా , ఎడిటర్ గా ఇలా రకరకాల బాధ్యతలను తన భుజస్కంధాలపై మోసిన అలుపెరుగని వీరుడు. అలాగే అల్లు అరవింద్ కూడా అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నాడు. పలు హిట్ చిత్రాలను నిర్మించి తెలుగు సినిమాకు తన కంట్రిబ్యూషన్ ని అందించాడు అందుకే పద్మశ్రీ అవార్డు రావాలని ఆశిస్తున్నాడు అల్లు అర్జున్. అయితే ఈ ఇద్దరికీ అవార్డు రావాలంటే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సిఫారసు చేయాలి అలాగే కేంద్రం ఒప్పుకొని ఇవ్వాలి. ఇంత తతంగం ఉంది మరి.