మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఎవరితో ?

Published on Nov 30,2019 12:34 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా చేస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అలాగే జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది దాని తర్వాత మహేష్ బాబు తదుపరి సినిమా ఎవరితో అన్నది ప్రశ్నగా మారింది. మహేష్ బాబు తో సినిమాలు చేయడానికి పలువురు దర్శకులు పోటీ పడుతున్నప్పటికీ అందులో ముందు వరుసలో ఉన్నది మాత్రం వంశీ పైడిపల్లి అలాగే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ లు.

మహేష్ బాబు - వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మహర్షి వంటి కమర్షియల్ హిట్ వచ్చింది దానికి తోడు ఆ సినిమా మహేష్ మనసుకు బాగా హత్తుకున్నా సినిమా కావడంతో కొన్ని చోట్ల బయ్యర్లు స్వల్ప నష్టాలు చవిచూసినప్పటికీ మళ్ళీ వంశీ తో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు . మహేష్ మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కథ వండటంలో బిజీ గా ఉన్నాడు వంశీ. ఇక కేజీఎఫ్ తో దక్షిణాదిన సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ కూడా మహేష్ కోసం కథ రెడీ చేస్తున్నాడు. ఈ ఇద్దరిలో ఎవరు ముందుగా పక్కా స్క్రిప్ట్ తో వస్తే వాళ్లతో సినిమా చేయనున్నాడు. అయితే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 తో బిజీ గా ఉన్నాడు కాబట్టి మళ్ళీ వంశీ పైడిపల్లి తోనే మహేష్ తదుపరి సినిమా ఉండొచ్చు.