ప్రభాస్ తదుపరి ఎవరితో ?

Published on Nov 26,2019 11:44 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తదుపరి సినిమా ఎవరితో అన్నది సస్పెన్స్ గా మారింది. తాజాగా ఈ హీరో జాన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ , గోపికృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం ఉండనుంది అని తెలుస్తోంది అలాగే బాలీవుడ్ దర్శక దిగ్గజం కరణ్ జోహార్ దర్శకత్వంలో ఓ సినిమా ఉండనుంది అని కూడా వార్తలు వస్తున్నాయి.

దాంతో అసలు ఈ ఇద్దరి లో ప్రభాస్ తదుపరి సినిమా ఎవరితో ఉండనుంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రభాస్ కోసం సురేందర్ రెడ్డి పదేళ్లుగా ఎదురు చూస్తున్నాడు. ప్రభాస్ తో సినిమా చేయాలనీ ఎప్పటి నుండో అనుకుంటున్నాడు. ఇక కరణ్ జోహార్ వచ్చి బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పెరగడంతో ప్రభాస్ తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. మరి ఈ ఇద్దరిలో ప్రభాస్ ఎవరికీ ఛాన్స్ ఇస్తాడో చూడాలి.