చిరంజీవి ఇంటికి బాలయ్య ఎందుకు రాలేదు ?

Published on Nov 25,2019 11:23 AM

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో 80' స్ రీ యూనియన్ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ చిత్ర రంగానికి చెందిన పలువురు స్టార్స్ హాజరయ్యారు కానీ టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ మాత్రం హాజరుకాలేదు దాంతో చిరు ఇంటికి బాలయ్య ఎందుకు రాలేదు అన్న చర్చ మొదలయ్యింది. చిరంజీవి మాస్ హీరో అలాగే బాలయ్య కూడా మాస్ హీరో. చిరంజీవి తో పోటీ పడిన బాలయ్య ఎక్కడ ఉంటే అక్కడ సరికొత్త జోష్ ఉంటుంది.

కానీ నిన్న చిరు ఇంట్లో జరిగిన వేడుకలో బాలయ్య కనిపించకపోవడం పెద్ద లోటు గా కనిపించింది. ఇక ఈ వేడుకలో పాల్గొన్న పలువురు ప్రముఖులకు చిరంజీవి స్వయంగా డ్రింక్స్ అందించడం విశేషం. ప్రతీ ఏడాది 80'స్ రీ యూనియర్ పేరిట నిర్వహిస్తున్న ఈ వేడుకలు ఈసారి హైదరాబాద్ లో చిరంజీవి ఇంట్లో జరిగాయి. దక్షిణ భారతంలోని స్టార్స్ అందరూ హాజరయ్యారు కానీ బాలయ్య రాలేదు , ఇక బాలయ్య రూలర్ చిత్రంతో బిజీ గా ఉండటం వల్ల రాలేకపోయాడని తెలుస్తోంది.