సమంత ఎందుకు డుమ్మా కొట్టింది ?

Published on Nov 18,2019 16:48 PM

నిన్న అన్నపూర్ణ స్టూడియోస్ లో అంగరంగ వైభవంగా అక్కినేని ఇంటర్నేషనల్ అవార్డు వేడుక జరిగింది. ఈ వేడుకలో అక్కినేని కుటుంబానికి చెందిన వాళ్ళు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అయితే సమంత మాత్రం హాజరు కాలేదు డుమ్మా కొట్టింది దాంతో ఇదే విషయం పెద్ద టాపిక్ అయ్యింది. అక్కినేని నాగార్జున పెద్ద కోడలు అయిన సమంత డుమ్మా కొట్టడం చర్చ గా మారింది.

అయితే సమంత ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది అందువల్ల ఈ ఈవెంట్ కు రాలేదా ? లేక మరో కారణం వల్లనా అన్నది తేలాల్సి ఉంది. మొత్తానికి ఇంత పెద్ద ఫంక్షన్ జరుగుతున్నప్పుడు సమంత హాజరు కాకపోవడం పెద్ద లోటు అనే చెప్పాలి. సమంత ఇటీవలే ఓ బేబీ చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది. అలాగే 96 అనే రీమేక్ చిత్రంలో కూడా నటించింది. ఇక ఇప్పుడేమో ఓ వెబ్ సిరీస్ లో నెగెటివ్ రోల్ పోషిస్తోంది సమంత.