ఐశ్వర్యా రాయ్ చిరు సరసన నటిస్తుందా ?

Published on Jul 12,2019 10:57 AM

అందాల భామ ఐశ్వర్యా రాయ్ చిరంజీవి సరసన నటిస్తుందా ? ఆమె ఒప్పుకుంటుందా ? ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదే చర్చ సాగుతోంది . కొరటాల శివ దర్శకత్వంలో చరణ్ నిర్మించనున్న చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభినయం పోషించనున్నాడు . కాగా ఆ చిత్రంలో చిరంజీవి సరసన ఐశ్వర్యా రాయ్ అయితే బాగుంటుందని ఫీలయ్యాడట దర్శకుడు కొరటాల దాంతో ఆమెని సంప్రదించేపనిలో పడ్డారు మెగా బృందం . 

అయితే ఐశ్వర్యా రాయ్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుంటుందా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న గా మారింది . ఒకవేళ ఐష్ ఒప్పుకుంటే మెగా ఫ్యాన్స్ ఆనందానికి అంతే ఉండదు . చిరు - ఐష్ ల జోడీ ప్రేక్షకులను కనువిందు చేయడం ఖాయం మరి . అయితే ఐష్ ఒప్పుకుంటుందా అన్నదే ప్రశ్న .