సందీప్ రెడ్డి వంగా కు చిరు ఛాన్స్ ఇస్తాడా ?

Published on Oct 21,2019 17:07 PM

అర్జున్ రెడ్డి , కబీర్ సింగ్ చిత్రాలతో ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అయితే ఈ దర్శకుడికి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనీ కోరికగా ఉందని అసలు రహస్యాన్ని బయటపెట్టాడు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి చిరంజీవి వీరాభిమానినని పైగా చిరు వయసుకి సరిపోయే కథ నా దగ్గర ఉందని అంటున్నాడు సందీప్ రెడ్డి వంగా.

ఈ దర్శకుడి కోరిక బాగానే ఉంది చిరంజీవి ఇతడికి ఛాన్స్ ఇస్తాడా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ఎందుకంటే సందీప్ రెడ్డి కి అడల్ట్ కంటెంట్ డైరెక్టర్ గా పేరు పడింది అలాగే ఇలాంటి అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే చేస్తాను అంటూ నోరు జారాడు కూడా. దాంతో చిరంజీవి ఈ వయసులో అలాంటి సినిమాలు చేస్తాడా ? అతడికి ఛాన్స్ ఇస్తాడా ? అన్నది పెద్ద ప్రశ్నే మరి.