నాగార్జున సంచలన నిర్ణయం తీసుకోనున్నాడా ?

Published on Jan 09,2019 17:45 PM

ఈరోజు ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం విడుదలైన విషయం తెలిసిందే . ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య , బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించగా అక్కినేని పాత్రలో సుమంత్ నటించాడు . అయితే ఈ ఇద్దరి తర్వాత సుమంత్ కు అంతటి చక్కని పేరు వస్తోంది ఎందుకంటే సుమంత్ అచ్చం అక్కినేని ని తలపించాడు . అక్కినేని మనవడు అయిన సుమంత్ అక్కినేని పాత్రలో జీవించాడు దాంతో ప్రేక్షక లోకం దాసోహం అంటోంది సుమంత్ కు . 

ఇప్పటివరకు సుమంత్ హీరోగా పరిచయమై 20 ఏళ్ళు దాటింది అయినా సాలిడ్ హిట్స్ కొట్టలేక కెరీర్ లో చతికిల బడిపోయాడు కానీ తొలిసారిగా అక్కినేని పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేయడమే కాకుండా అక్కినేని బయోపిక్ లో సుమంత్ నటిస్తే చూడాలని ఉంది అనిపించేలా చేసాడు . టాలీవుడ్ లో పలు బయోపిక్ లు తీస్తున్నారు కానీ అక్కినేని బయోపిక్ మాత్రం చేయము అని ప్రకటించాడు నాగార్జున ఎందుకంటే అక్కినేని సంపూర్ణమైన జీవితాన్ని ఆస్వాదించాడు కాబట్టి అని నాగ్ అభిప్రాయం అయితే సుమంత్ నటన చూసాక నాగార్జున సంచలన నిర్ణయం తీసుకున్నా తీసుకోవడం ఖాయమని వినిపిస్తోంది . ఎందుకంటే అక్కినేని పాత్రలో ఇరగ్గొట్టడానికి సుమంత్ సిద్ధంగా ఉన్నాడు కాబట్టి .