నితిన్ ఆ సినిమా చేస్తాడా ? లేదా ?

Published on Nov 30,2019 12:47 PM

హీరో నితిన్ హిందీలో ఘనవిజయం సాధించిన '' అంధ దూన్ '' చిత్ర రీమేక్ హక్కులు తీసుకున్నాడు. హిందీలో హిట్ అయ్యింది కాబట్టి తెలుగులో కూడా మంచి హిట్ అవుతుందని భావించాడు అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నితిన్ ఈ సినిమాలో నటించడం కష్టమేనని తెలుస్తోంది. రీమేక్ హక్కులు తన దగ్గర ఉన్నప్పటికీ ఈ సినిమాలో నటించకుండా మరో యంగ్ హీరోతో ఈ రీమేక్ చేయాలనే ఆలోచన కూడా చేస్తున్నాడట.

అయితే ఈ విషయం పై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదట దాంతో ప్రస్తుతానికి అయితే తర్జన భర్జన సాగుతోంది. నితిన్ హీరోగా నటించాలా ? లేక మరొకరితో నిర్మించాలా ? అనే విషయాన్నీ త్వరలోనే తేల్చనున్నాడట నితిన్. ప్రస్తుతం ఈ హీరో భీష్మ అనే చిత్రంలో నటిస్తున్నాడు నితిన్. బీష్మ తో మళ్ళీ గాడిలో పడతానని భావిస్తున్నాడు నితిన్.