ప్రభాస్ అనుష్కని ఛాలెంజ్ చేయనున్నాడా ?

Published on Apr 25,2020 14:03 PM
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అనుష్క ని ఛాలెంజ్ చేయనున్నాడా ? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ ఏంటి ? అనుష్క ని ఛాలెంజ్ చేయడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? కరోనా వైరస్ నేపథ్యంలో దేశమంతటా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ వల్ల బి ది రియల్ మ్యాన్ అనే ఛాలెంజ్ వైరల్ అవుతోంది మన టాలీవుడ్ లో. సందీప్ రెడ్డి వంగా మొదలు పెట్టిన ఈ ఛాలెంజ్ ని ఎస్ ఎస్ రాజమౌళి స్వీకరించి ఎన్టీఆర్ , చరణ్ లకు విసిరాడు. అది మెల్లిగా చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ లకు పాకింది.

ఇక ఈ ఛాలెంజ్ లో భాగంగానే బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ప్రభాస్ ని ఛాలెంజ్ చేసాడు. అయితే ప్రభాస్ ఈ పనులు చేస్తాడా ? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ పని చేస్తే తప్పకుండా అనుష్క ని ఛాలెంజ్ చేస్తాడు ప్రభాస్. ఎందుకంటే అనుష్క - ప్రభాస్ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. అలాగే ఇద్దరికీ పెళ్లి కాలేదు దాంతో ఈ ఇద్దరి మధ్య పోటీ అంటే రసవత్తరంగా సాగడం ఖాయమని భావిస్తున్నారు.