రాజమౌళి బాలయ్య తో సినిమా చేస్తాడా ?

Published on Apr 28,2020 16:40 PM
నటసింహం నందమూరి బాలకృష్ణ తో గతంలో పలుమార్లు సినిమా చేయాలనీ ప్లాన్ చేసాడట ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. అయితే రాజమౌళి అనుకున్నాడు కానీ బాలయ్య తో మాత్రం సినిమా చేయలేకపోయాడు. దాంతో ఇప్పుడు బాలయ్య - రాజమౌళి కాంబినేషన్ లో సినిమా వస్తుందా ? అన్న అనుమానం నెలకొంది. రాజమౌళి కెరీర్ ప్రారంభంలో బాలయ్యతో సినిమాలు చేయాలనీ చాలా ప్రయత్నాలు చేసాడట కానీ అప్పట్లో బాలయ్య స్టార్ కాబట్టి కుదరలేదు , అలాగే బాలయ్యని అంతగా నమ్మించలేకపోయాడు.

కానీ కాలం మారింది ఇప్పుడు రాజమౌళి ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు బాహుబలి చిత్రంతో. బాహుబలి తర్వాత ఎన్టీఆర్ , చరణ్ లతో ఆర్ ఆర్ ఆర్ చిత్రం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా విడుదల అయ్యాక మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్లు కూడా ప్రకటించాడు జక్కన్న. అంటే ఈలెక్కన బాలయ్యతో సినిమా సాధ్యం కాకపోవచ్చు. కాకపోతే యంగ్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలో బాలయ్య నటిస్తే బాగానే ఉంటుంది కానీ బాలయ్య హీరోగానే చేస్తాడు తప్ప కీలక పాత్రల్లో నటించమంటే ఒప్పుకుంటాడా ? డౌటే .