సాహో 350 కోట్లు వసూల్ చేయగలదా ?

Published on Aug 26,2019 11:59 AM
ప్రభాస్ నటించిన సాహో ఎట్టకేలకు విడుదలకు రంగం సిద్ధమైంది. మరో మూడు రోజుల తర్వాత సాహో విడుదల కానుంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రాన్ని యువి క్రియేషన్స్ నిర్మించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రానికి 320 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమాని కొన్న బయ్యర్లు లాభాలు పొందాలంటే 350 కోట్ల షేర్ వసూల్ చేయాలి సాహో. 

ఆ మొత్తం వసూల్ చేస్తేనే బయ్యర్లు సేఫ్ అవుతారు, సాహో చిత్రంపై భారీ అంచనాలున్నాయి కాబట్టి భారీ ఓపెనింగ్స్ వస్తాయి అందులో సందేహం లేదు కాకపోతే హిట్ టాక్ వస్తేనే భారీ కలెక్షన్స్ వస్తాయి లేదంటే బయ్యర్లు నష్టపోవడం ఖాయం. నిర్మాతలకు ఎప్పుడో లాభాలు వచ్చాయి ఇక ఇప్పుడు రావాల్సింది బయ్యర్లకు అది వస్తుందా ? లేదా ? అన్నది ఈనెల 30 న తెలిసిపోతుంది.