ఎన్టీఆర్ తో శృతి హాసన్ మళ్ళీ చేయనుందా ?

Published on Apr 28,2020 16:24 PM
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన మళ్ళీ శృతి హాసన్ నటించనున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఆ సినిమాలో ఒక హీరోయిన్ గా అందాల భామ శృతి హాసన్ ని తీసుకోవాలని చూస్తున్నాడట దర్శకులు త్రివిక్రమ్. ఇంకా ఫైనల్ కాలేదు కానీ ఎన్టీఆర్ సరసన శృతి అయితే బాగుంటుందని భావిస్తున్నాడట ఈ దర్శకుడు. అయితే గతంలో ఎన్టీఆర్ - శృతి హాసన్ జంటగా నటించిన '' రామయ్యా వస్తావయ్యా '' అట్టర్ ప్లాప్ అయ్యింది.

దాంతో బ్యాడ్ సెంటిమెంట్ ఉంది కాబట్టి ఆమెని తీసుకోవడం దుస్సాహసమే అని చెప్పాలి. పైగా శృతి హాసన్ గతకొంత కాలంగా సినిమాల్లో నటించడం లేదు. ఒకటి ఆరా సినిమాలు చేసింది కానీ అవి ఇంకా విడుదల కాలేదు మళ్ళీ ఈ భామకు స్టార్ డం కట్టబెట్టలేదు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ కు జోడీగా శృతి హాసన్ ని తీసుకుంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ శృతి హాసన్ ని ఎంపిక చేస్తే తప్పకుండా వ్యతిరేకత వచ్చే అవకాశం అయితే ఉంది.