విజయ్ దేవరకొండ తమ్ముడు హీరోగా సక్సెస్ అవుతాడా ?

Published on May 01,2019 17:06 PM

టాలీవుడ్ లో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ . తక్కువ సమయంలోనే స్టార్ డం అందుకున్నాడు ఈ హీరో ఇంకేముంది విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ తో అతడి తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా దొరసాని అనే చిత్రం రూపొందింది . కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన దొరసాని చిత్రంలో హీరోయిన్ గా సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక నటిస్తోంది . 

తెలంగాణ లో దొరలు , దొరసాని వ్యవస్థ ఉండేది ఒకప్పుడు , దాన్ని కథా వస్తువుగా ఎంచుకొని మహేంద్ర చేసిన ఈ సినిమాలో  విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్నాడు . మరి ఈ దొరసాని తో విజయ్ దేవరకొండ తమ్ముడు హీరోగా సక్సెస్ అవుతాడా ? చూడాలి . ఈ దొరసాని సినిమా విజయ్ దేవరకొండ తమ్ముడికే  కాదు రాజశేఖర్ కూతురు కి కూడా పెద్ద పరీక్షే ! ఎందుకంటే వీళ్ళ సక్సెస్ వాళ్లకు గర్వకారణం అవుతుంది మరి .