భారీ అంచనాలను విజయ్ దేవరకొండ అందుకుంటాడా ?

Published on Jul 22,2019 17:02 PM

ఈనెల 26 న విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం విడుదల అవుతోంది . దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి . ఇక యువత కూడా పెద్ద ఎత్తున థియేటర్ లకు వెళ్ళడానికి సిద్ధమైంది కూడా . అయితే సినిమా కు ఎలాగూ ఓపెనింగ్స్ అదిరిపోతాయి కానీ సినిమా బాగుంటేనే సక్సెస్ అవుతుంది లేదంటే బొక్కా బోర్లా పడుతుంది ఎందుకంటే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి మరి . 

విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న రెండోసారి జంటగా నటించడం కూడా అంచనాలు పెరగడానికి కారణం . భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పై విజయ్ దేవరకొండ కూడా భారీగా ఆశలు పెట్టుకున్నాడు , నమ్మకంగా ఉన్నాడు అందుకే ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ , మలయాళ , కన్నడ బాషలలో విడుదల చేస్తున్నాడు . అయితే ఆ అంచనాలు ఏమౌతాయో తెలియాలంటే ఈనెల 26 వరకు ఎదురు చూడాల్సిందే .