బాలకృష్ణ - రాజశేఖర్ ల సినిమా ఉత్త గ్యాసే నట

Published on Mar 23,2019 11:40 AM

తమిళంలో సంచలన విజయం సాధించిన విక్రమ్ వేదా చిత్రాన్ని తెలుగులో నందమూరి బాలకృష్ణ , డాక్టర్ రాజశేఖర్ ల మల్టీస్టారర్ కాంబినేషన్ లో సినిమా రూపొందనున్నట్లు వార్తలు వచ్చాయి . అయితే అవి అన్నీ ఉత్త గ్యాస్ వార్తలే అంటూ వై నాట్ సంస్థ ఓ ప్రెస్ నోట్ ని రిలీజ్ చేసింది . మాధవన్ - విజయ్ సేతుపతి ల కాంబినేషన్ లో వచ్చిన విక్రమ్ వేదా రీమేక్ చేయాలనీ చాలామంది ప్రయత్నాలు చేసారు . 

అయితే రీమేక్ హక్కులు ఎవరికీ ఇవ్వలేదని , ఇక బాలకృష్ణ - రాజశేఖర్ లు హీరోలుగా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయని అవి వాస్తవం కాదని తేల్చి చెప్పారు . అయితే రీమేక్ విషయంలో త్వరలోనే మేమే అధికారికంగా ప్రకటిస్తాం అంటూ సెలవిచ్చారు వై నాట్ సంస్థ ప్రతినిధులు . అంటే బాలకృష్ణ - రాజశేఖర్ ల కాంబినేషన్ లో సినిమా లేదన్న మాట.